సాలూరలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సాలూర మండల కేంద్రంలో సోమవారం దండోర సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్బంగ మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గంగులు, వీహెచ్ పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ మాట్లాడుతూ గత 31 సంవత్సరాల చరిత్రలో శాంతియుతంగా కొనసాగిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనకై ఉద్యమించిన ఎమ్మార్పీఎస్ వికలాంగుల హక్కుకై, గుండె జబ్బుల పిల్లల వైద్యంకోసం ఆరోగ్యశ్రీ లాంటి సామాజిక సమస్యల సాధనకు కృషి చేసిందని అన్నారు. మందకృష్ణ మాదిగ అలుపెరగని ఉద్యమ పోరాటంతో ప్రధాని నరేంద్రమోడి ప్రశంసించి ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి కృషి చేశారని, అలాగే మందకృష్ణమాదికు పద్మశ్రీ అవార్డు అందించి సన్మానించారని అన్నారు. అనంతరం అతిథులకు నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. మందకృష్ణమాదిగ జన్మదినం సందర్శన కేక్ కట్ చేసి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మెన్ అల్లె జనార్దన్,కాంగ్రెస్ నాయకులు అల్లె రమేష్,శివకాంత్ పటేల్,నాగరాజు,వెంకట్ పటేల్,ప్రజ్ఞశ్రీ రాజు,బీజేపీ నాయకులు ముట్టెన్ ప్రకాశ్ ,శంకర్ పటేల్,కేజీ గంగారాం,మాజీ ఏఎంసీ వైస్ చైర్మెన్ షకీల్,బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పాండు సింగడి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లింబూరి లక్ష్మణ్, గడ్డం రమేష్,అద్దంకి లింగయ్య, గ్రామ అధ్యక్షులు సుభాష్,జేఎల్ఎం చంటి,టన్నే రవి,చాందు,లాలయ్య, లస్మయ్య, లింబయ్య, సాయిలు,నాగురావు,పీరయ్య, పోశెట్టి,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....