Post Views: 80
భైంసా పట్టణంలో మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి వేడుకలు ఆద్యంతం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో భాస్కర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.

విట్టల్-రుక్మిణి దేవతామూర్తుల వేషాలలో చిన్నారులు అలరించారు. వీరి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భజన గాయకులు ఆలపించిన కీర్తనలు ప్రాంతమంతా మంత్రముగ్ధ వాతావరణాన్ని నెలకొల్పాయి. ప్రధాన వీధుల గుండా నిర్వహించిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలకు మహత్తరంగా ఊతమిచ్చారు.వేడుకలు సజావుగా సాగేందుకు మార్వాడి సమాజ్ సభ్యులు కృషి చేశారు. భద్రత, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ పరంగా పోలీసులు సమర్థవంతంగా సేవలందించారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533