Post Views: 713
బోధన్ టౌన్:నిజామాబాద్ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వర్ని మండలం సైద్‌పూర్ గ్రామానికి చెందిన ఖైదీ కాట్రోత్ జీవన్ జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బోధన్ శివారులో ఉన్న మై నేషన్ ఫిల్లింగ్ స్టేషన్ (జైల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నడుపుతున్న భారత్ పెట్రోల్ పంపు) నుంచి పరారయ్యాడు.
ఇప్పటికే 18 నెలలుగా సెమి ఓపెన్ ఖైదీగా పనిచేస్తున్న జీవన్ పరారైన నేపథ్యంలో జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాల సేకరణతో విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో ఖైదీ తిరుపతిలో ఉన్నట్టు సమాచారం అందడంతో, బోధన్ పోలీసులు ASI బాబురావు, PC-804 కె. రవి, PC-2914 డి. సాయి కృష్ణ తిరుపతికి వెళ్లి, స్థానిక పోలీసుల సహకారంతో జూలై 4వ తేదీ తిరుపతి దేవస్థానం ఆవరణలో ఖైదీని పట్టుకున్నారు.
ఆ తరువాత ఖైదీని బోధన్ తీసుకొచ్చి, జూలై 5న అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533