బోధన్ మండలంలోని పెంటాఖుర్థు గ్రామంలో గ్రామస్థులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన పల్లె దవాఖానను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం చిట్టెపు రెడ్డి కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివ సాయి పటేల్ ఆధ్వర్యంలో, వైద్య సిబ్బంది సమన్వయంతో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్య ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ చేతుల మీదుగా దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ఇది కీలక ముందడుగు. అందరికి అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలే సమాజ అభివృద్ధికి బలమైన అస్త్రం” అని అన్నారు. దవాఖాన ఏర్పాటుకు సహకరించిన గ్రామ పెద్దలు, సంఘాల ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్‌లు వీరన్న పటేల్, శ్రీనివాస్ రావు, పిఏసిఎస్ చైర్మన్ అమర్నాథ్ బాబు, మాజీ సర్పంచ్ సుదర్శన్ పటేల్, మజీ ఉపసర్పంచ్ షేక్ భురాన్, పిఏసిఎస్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, డైరెక్టర్ జయరాం, ఇంచార్జ్ డాక్టర్ శేఖర్, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533