నిర్మల్ జిల్లా, జూలై 2:డిజిటల్ పోలీసింగ్‌కు మరో ముందడుగుగా, నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఆధునిక ట్యాబ్‌లు, కెమరాలు పంపిణీ చేశారు. భైంసాలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పరికరాలను ఆమె స్వయంగా పోలీస్ సిబ్బందికి అందజేశారు.
ఈ ట్యాబ్‌లు పోలీసులు నిత్యం నిర్వహించే బ్లూ కోర్ట్ పర్యటనలు, 100 డయల్ స్పందనలు, రాత్రిపూట ప్యాట్రోలింగ్ సమయంలో అనుమానితుల వివరాలు నమోదు, ట్రాఫిక్ చలాన్లు జారీ వంటి కార్యాచరణలో ఉపయోగపడనున్నాయి.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – ‘‘నేటి డిజిటల్ యుగంలో ప్రజల భద్రతకు పోలీస్ శాఖ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ట్యాబ్‌లు, కెమెరాల ద్వారా అధికారులు సంఘటన స్థలాల వద్ద నుంచి ప్రత్యక్ష సమాచారం అందించగలుగుతారు. బాధితుల వివరాల నమోదు, సమీప బృందాలకు సమాచారం చేరవేత, వేగవంతమైన స్పందన వంటి అంశాల్లో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి,’’ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు గోపీనాథ్, మల్లేష్, ఎస్‌ఐలు అశోక్, పెర్సిస్, శ్రీనివాస్, నవనీత్ రెడ్డి, కృష్ణా రెడ్డి, సుప్రియ, హనుమంతులు తదితరులు పాల్గొన్నారు.
ఈ చర్యతో పోలీస్ వ్యవస్థ మరింత పారదర్శకంగా, సమర్థంగా మారే దిశగా అడుగులు వేస్తోందని అధికారులు తెలిపారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....