ప్రజల అవసరాన్ని అవకాశంగా మార్చిన మీసేవ కేంద్రాల నిర్వాహకులు – రెవెన్యూలోనే కుమ్మక్కు!
బోధన్, జూలై 2:
ప్రజలకు నిత్యవసర వస్తువులు అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కొందరు దళారులు లాభదాయక వ్యాపారంగా మార్చుకున్నారు. బోధన్ నియోజకవర్గంలోని పలు మీసేవ కేంద్రాలు, పాన్ షాపులు, రేషన్ డీలర్లు కలసి “కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం” అంటూ వేల రూపాయల డబ్బు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.?
ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేయబోయే రేషన్ కార్డులకు రూ.3000 నుండి రూ.5000 వరకు వసూలు చేస్తున్న దళారుల చేతుల్లో ప్రజలు బలైపోతున్నారు. రెవెన్యూ శాఖలోని కొందరు కింది స్థాయి సిబ్బంది కూడా ఈ రాకెట్లో భాగమవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటివరకు ప్రతి గ్రామం నుంచి 250-500 దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వచ్చాయని సమాచారం. రెవెన్యూ అధికారులు సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి ఎదురుచూస్తుండగా, ఈ గ్యాప్‌ను బాగా వాడుకుంటున్నారు మీసేవ కేంద్రాల నిర్వాహకులు. ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలోని పలు మీసేవ కేంద్రాలలో వసూళ్ల దందా బాగా జోరందుకుంది.
గతంలో ఎన్నికల సమయంలో బోగస్ ఓట్లను నమోదు చేయడంలోనూ ఈ మీసేవ కేంద్రాల పాత్రపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఒకే చిరునామాతో రెండు వేలకు పైగా ఓట్లను నమోదు చేయడం, మహారాష్ట్రకు చెందిన ఓటర్లను చొరబాటు చేయడం వంటి ఉదంతాలపై బీజేపీ నేత మెడపాటి ప్రకాష్ రెడ్డి పోరాటం చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అప్పట్లో విచారణ జరిపినా, ఇప్పుడు మళ్లీ అదే దందా పునరావృతం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రభుత్వ హామీ మేరకు రేషన్ కార్డుల మంజూరుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో, దళారులు ప్రజల ఆవశ్యకతను ఆదాయ వనరుగా మలచుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
“నిర్లక్ష్యానికి తావుండదే!”…

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....