నిజామాబాద్ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి బోధన్ పట్టణానికి చెందిన ప్రతాప్ గుప్తా గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా పూర్ణ ప్రసాద్, కోశాధికారిగా విజయ్ కుమార్ స్వామి ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కమిటీ పదవీకాలం రెండు సంవత్సరాలుగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇతడి ఎన్నికను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో ప్రతాప్ గుప్తాను పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోలియం డీలర్లు ఒకజోటిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం గర్వంగా ఉంది. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నన్ను నమ్మి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు కట్టుబడి పనిచేస్తా. డీలర్ల సమస్యల పరిష్కారానికి చురుకైన పాత్ర పోషిస్తా,” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అధ్యక్షుడు లయన్ పి. బసవేశ్వరరావు, లయన్ కొడాలి కిషోర్ కుమార్, లయన్ యార్లగడ్డ శ్రీనివాస్ రావు, లయన్ వెంకటేశ్వరరావు, లయన్ శ్రీధర్, లయన్ రవీందర్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....