నిజామాబాద్, జూలై 2:జోన్-2 స్థాయిలో పోలీస్ డ్యూటీ మీట్ – 2025 కార్యక్రమం నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. గారు అధికారికంగా ప్రారంభసూచన ఇచ్చారు.
ఈ మీట్‌లో నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, అదిలాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ విధుల్లో నైపుణ్యాలు, సామర్థ్యం పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ మెడిసిన్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ అనాలసిస్, నార్కోటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్, తదితర విభాగాలలో ఎంపిక పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం మూడు రోజులపాటు జరగనుండగా, ఇందులో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే డ్యూటీ మీట్‌కు ఎంపిక చేయనున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ సాయి చైతన్య గారు మాట్లాడుతూ, “నేటి ఆధునిక నేరాల విచారణకు శాస్త్రీయ దృక్పథంతో పని చేయగల నైపుణ్యాలు పోలీసులలో ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి సమర్థుల ఎంపిక కోసం ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు డీసీపీ (AR) రామ్ చంద్ర రావ్, సీసీఎస్ ఏసీపీ నాగవేంద్ర చారి, తదితర అధికారులు పాల్గొన్నారు. అనేకమంది సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది కూడా ఇందులో భాగమయ్యారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....