బోధన్ పట్టణంలోని నాలుగో వార్డులో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచిత యూనిఫామ్లు మరియు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ సార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా SMC చైర్మన్ విజయ్ గారు, బోధన్ టౌన్ ST సెల్ అధ్యక్షులు బానోత్ సాయి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్, పూర్వ విద్యార్థుల అధ్యక్షులు కన్నడి ప్రవీణ్, వార్డు పెద్దలు కనకరాజు సార్, గంగా నర్సా గౌడ్, నాగులు, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం అభినందనీయమని పాల్గొన్న ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని వారు కోరారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....