సాయి నగర్ చెరువు కట్టపై మాఫియా గుట్టు…
. ఆన్లైన్ మట్కా – విద్యార్థుల భవిష్యత్తుకు కాలుడు పెట్టే దందా!
(నిజామాబాద్ జిల్లా – సాలుర మండలం)
నిజామాబాద్ జిల్లా సాలుర మండలంలోని సాయి నగర్ కాలనీ… చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పుట్టినిల్లు అయ్యింది…. అభివృద్ధి పేరుతో ప్రారంభమైన ఈ వాసస్థలం, ఇప్పుడు పేకాట మాఫియాలు, మట్కా ఏజెంట్లు, వడ్డీ దందాలకు కేంద్రంగా మారడం గమనార్హం.
సాయి నగర్ చెరువు కట్ట ప్రాంతాలు, పాడుబడ్డ భవనాలు, పాత షెడ్లు – ఇవన్నీ ఇప్పుడు పేకాట స్థావరాలుగా మారిపోయాయి. అక్కడ పేకాట ఆటలతో పాటు మట్కా యాప్‌ల ద్వారా ఆన్లైన్ దందాలు రెచ్చిపోతున్నాయి. ప్రత్యేకంగా బయటకు కనిపించకపోయినా, వృద్ధుల నుండి విద్యార్థుల వరకు ఈ దందాల్లో చిక్కుకుపోతున్నారు.
🔹 వాహనాలను తాకట్టు పెట్టి రుణాల పేరుతో బానిసలుగా మారుస్తున్న వడ్డీ దందాలు
🔹 మహారాష్ట్ర నెంబర్లతో నడిచే ఆన్‌లైన్ మట్కా యాప్‌లు
🔹 ముఠాలు బలపడుతూ, కొత్తవారిని రంగంలోకి దించి గుట్టు దాచడంలో నిపుణత
🔹 ఫోన్ ట్రాకింగ్‌కు భయపడి తరచూ వేదికలు మార్చే ముఠాలు..
ఇలాంటి పరిస్థితుల్లో స్థానికులు భయంతో నోరు మెదపలేని స్థితిలోకి వెళ్లిపోయారు. గతంలో రెండు మూడు సార్లు పోలీసులు దాడులు చేసినప్పటికీ, ఎప్పటికప్పుడు సమాచారం లీక్ అవడంతో ముఠాలు తప్పించుకోవడం అలవాటుగా మారింది.
ఇవే కారణాల వల్ల కొన్ని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు దారితీసిన ఘటనలు నమోదయ్యాయి. పాఠశాల విద్యార్థులు సైతం మొబైల్ యాప్‌ల ద్వారా మట్కా వ్యసనానికి బానిసలవుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
—
ప్రజల డిమాండ్ –
👉 ముఠాలపై నిఘా పెట్టి, స్థిరమైన చర్యలు తీసుకోవాలి.
👉 ఆన్లైన్ మట్కా, వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేసి అరెస్టులు జరిపాలి.
👉 విద్యార్థులను ఈ దో నంబర్ దందాల నుంచి రక్షించాలి.
👉 స్థానికులు భయపడకుండా ఫిర్యాదు చేసే పర్యావరణం కల్పించాలి.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....