Post Views: 153
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతోమంది ఆడపడుచులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. బోధన్ నియోజకవర్గానికి చెందిన సాలూర, ఎడపల్లి, బోధన్ మండలాల్లోని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తూ, బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్యులు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “ప్రభుత్వ పథకాల వలన నిరుపేద కుటుంబాల్లో ఆనందం చేకూరుతోంది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సామాజిక న్యాయం అందించే చర్యల్లో భాగం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సాలూర మండల PACS ఛైర్మన్ అల్లే జనార్ధన్, మండలల ఎమ్మార్వోలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....