అధికారులపై తీవ్రంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి — ప్రజల అవసరాలపై ఎటువంటి జాప్యం కూడదు…
. బోధన్ నియోజకవర్గంలో సమస్యలపై సమీక్షా సమావేశం…
. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి – ప్రజా సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే సూచన..
. రేషన్ కార్డు కుంభకోణంపై విచారణకు ఆదేశాలు — ఎమ్మెల్యే పీ. సుదర్శన్ రెడ్డి…
బోధన్, జూన్ 30:
బోధన్ నియోజకవర్గంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం బోధన్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహాతోతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు విద్య, వైద్యం, పారిశుద్యం వంటి ప్రాథమిక అవసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సేవా దృక్పథంతో ముందుండడం అభినందనీయమన్నారు.
ఇటీవలి కాలంలో రేషన్ కార్డుల జారీ సందర్భంగా “మీ సేవా” కేంద్రాల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని ఆయా విభాగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఎమ్మెల్యేకు వివరాలు అందించారు. ప్రజల ఆకాంక్షల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....