బోధన్, జూన్ 30:ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి, శ్రీమాన్ వైష్ణవాంగ్రీ సేవక్ దాస్ హాజరై, శ్రీ బలరాం, సుభద్ర, జగన్నాథ ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమం ప్రశంసనీయమని అభినందించారు. భక్తి మార్గంలో ప్రజలు కొనసాగాలని సూచించారు. పట్టణంలోని ఆచన్ పల్లి ప్రాంతంలో ఇస్కాన్ సేవా కార్యక్రమాల విస్తరణ కోసం నాలుగు ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ రథయాత్ర ఆచన్ పల్లి నుండి ప్రారంభమై, శక్కర్ నగర్ చౌరస్తా, కొత్త బస్ స్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్ స్టాండ్, శివాలయం కమాన్ మీదుగా తిరిగి టీటీడీ కల్యాణ మండపం వరకు వైభవంగా సాగింది. అనంతరం కల్యాణ మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు, మహా ప్రసాద వితరణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు అశోక్ ఆత్మ సీతారాయి దాస్, రత్నమై రాధిక దేవి దాస్, కేశవ కరుణానిది దాస్, యాదవ్ పతి గోవింద్ దాస్, నర్సింలు ప్రభుజీ, తిమ్మన్న ప్రభుజీ, శివరాం ప్రభుజీ, గంగాస్వామి ప్రభుజీ, పోలీసు అధికారులు ఏసీపీ శ్రీనివాస్, సీఐలు వెంకటనారాయణ, విజయ్ బాబు, కాంగ్రెస్ నాయకులు గంగా శంకర్, తూము శరత్ రెడ్డి, అంకు దాము తదితరులు పాల్గొన్నారు. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రథయాత్రకు వైభవం చేకూర్చారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533