నిజామాబాద్ జిల్లా – బోధన్ మండలం. లోని గ్రామాల్లో
ప్రభుత్వాలు మద్యం నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేళ… కొన్ని గ్రామాల్లో కల్తీ కల్లు మాఫియా ఆగడాలు తగ్గేలా కనిపించడం లేదు. బోధన్ మండలంలోని గ్రామలలో నిషేధిత కల్తీ కల్లు దర్జాగా అమ్మకాలు జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
గ్రామస్థుల సమాచారం ప్రకారం – గ్రామ శివారులో కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళల్లో అనుమానాస్పదంగా కల్లు సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. నాణ్యత లేని రసాయనాలతో తయారవుతున్న ఈ కల్లు మూత్రపిండాలు, కాలేయంపై తీవ్రమైన ప్రభావాలు చూపే ప్రమాదం ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రామంలోని విక్రయ కేంద్రాలపై సీసీ కెమెరాలు లేకపోవడం, గచ్చితమైన నిఘా వ్యవస్థ లేకపోవడంతో మాఫియాలకు దారితీస్తోంది. పోలీసులు ఈ అక్రమాలపై మౌనంగా ఉండటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రజల డిమాండ్:
గ్రామంలోని రహస్య కల్లు కేంద్రాలపై పోలీసు దాడులు జరపాలి.
సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు నిరంతర నిఘా కొనసాగించాలి.
ఆరోగ్యాన్ని హాని చేసే మద్యం అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
💬 “ప్రజల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వ ధర్మం” అని భావిస్తే, అధికారులు తక్షణమే స్పందించి ఈ కల్తీ కల్లు మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533