Post Views: 86
నిజామాబాద్, జూన్ 29:నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారి పర్యటన విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్ గారు ప్రకటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ – “కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో పాలనాధికారి (కలెక్టర్), సీనియర్ ఐఏఎస్ అధికారులు, భద్రతా విభాగం, అన్ని శాఖల అధికారులు మరియు వారి సిబ్బంది, బందోబస్తు విధుల్లో పాల్గొన్న వివిధ జిల్లాల పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ విభాగం, రైతులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, మరియు మీడియా ప్రతినిధుల పాత్ర అమోఘం” అని కొనియాడారు.
ఇలాంటి పెద్ద స్థాయి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు చూపిన శాంతిభద్రతల పట్ల అవగాహనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533