– పసుపు బోర్డు ఏర్పాటు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న రైతులు
– చారిత్రక నిర్ణయం అని జిల్లా ప్రజల ప్రశంసలు
– అధిక సంఖ్యలో రైతులను,కార్యకర్తలను కార్యక్రమానికి తరలించిన యువ నాయకులు
– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్
నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ పట్టణంలో ఆదివారం రోజు కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా ప్రారంభించబోయే పసుపు బోర్డు కార్యక్రమానికి, “రైతు మహాసభ”కు బిజెపి నాయకులు NRI కోనేరు శశాంక్ ప్రత్యేకంగా, బాధ్యతతో నిజామాబాద్ జిల్లా పరిధిలో గల పొతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా మండలాల నుండి మండల అధ్యక్షులను, రైతులను, కార్యకర్తలను భారీ సంఖ్యలో దాదాపు 700 మందితో కలిసి” రైతు మహాసభ”కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోనేరు శశాంక్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల రైతులందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లభించకపోవడం వల్ల ఇంతకాలం రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి సమస్యను తీసుకెళ్లి మన జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు జరిగే వరకు అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడంపై జిల్లా ప్రజలు, రైతులు గత ప్రభుత్వంతో ఎన్ని ప్రయత్నాలు, సుదీర్ఘ పోరాటాలు చేసిన వారు రైతుల వెతలు పట్టించుకున్న పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఆలోచించి పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకుగాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆరు మండలాల అధ్యక్షులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..