Post Views: 40
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పలు సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గాదెవార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని తీవ్రంగా విమర్శించారు.
బీఆర్ఎస్ నాయకులు భైంసా మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణంలో పారిశుద్ధ్యం పూర్తిగా లేని పరిస్థితి నెలకొంది. డ్రైనేజీలు మురికి కూపాలుగా మారాయని, వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విస్తరించే అవకాశముందని హెచ్చరించారు. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
అంతేకాక, మిషన్ భగీరథ పైపులు చాలా చోట్ల లీకేజీ అవుతున్నాయని, చెత్త సేకరణను సమర్థవంతంగా చేపట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533