పేద ప్రజలకు సంక్షేమ పథకాలు త్వరితగతిని అందించడమే నా ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శుక్రవారం భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో బైంసా పట్టణ మండలానికి చెందిన 159 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హాయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, చెక్కులు రావాలంటే సంవత్సరాల తరబడి సమయం పట్టేదని ప్రస్తుతం 18 నెలల కాలంలో ఐదు సార్లు చెక్కుల పంపిణీ చేశామన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూనే, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీపై ఇచ్చిన హామీల పైననే అడుగుతున్నామని వాటిని విమర్శ లాగా భావించకుండా, మాట తప్పకుండా పేద ప్రజలకు మేలు చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ హాయంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే నాలుగవ స్థానానికి మన దేశం ఎగబాకిందంటే అది మోదీ చలవేనన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సమావేశంలో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, ఆత్మ చైర్మన్ వివేక్, పిఎసిఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, బిజెపి పట్టణ మండల అధ్యక్షులు రావుల రాము, సిరం సుష్మ రెడ్డి ప్రతినిధులు మాజీ వైస్ ఎం పి పి. నర్సారెడ్డి, సోలంకి భీమ్రావు, మల్లేష్, పండిత్ రావు, రావుల పోశెట్టి, గౌతం పింగ్లే,దిలీప్, దిగంబర్, బాలాజీ పటేల్,మాజీ సర్పంచ్లు రాకేష్, శ్రీనివాస్ మాజీ ఎంపిటిసిఅశోక్ , మాజీ కౌన్సిలర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533