బోధన్, జూన్ 27 (తేదీ):ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటా 15 నిమిషాలకు బోధన్ డిపో నుండి ఆసిఫాబాద్ మరియు కాగజ్‌నగర్ దిశగా నూతన ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసుల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. గౌరవనీయ డిపో మేనేజర్ గారు స్వయంగా ఈ సర్వీసులను ప్రారంభించారు.ఈ ఎక్స్‌ప్రెస్ బస్సులు బోధన్ నుండి బయలుదేరి నిజామాబాద్, జగిత్యాల్, ధర్మపురి, మంచిర్యాల్ మీదుగా సాగి ఆసిఫాబాద్ మరియు కాగజ్‌నగర్‌ను చేరుకుంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం వీటి గమ్యస్థానాలు ప్రజలకు సమయం మరియు అందుబాటులో ప్రయాణ సౌలభ్యాన్ని కల్పించేలా. ఏర్పాటుచేయబడ్డాయి.ప్రాంత ప్రజల నుండి ఈ కొత్త సర్వీసులపై సానుకూల స్పందన లభిస్తోంది. ప్రత్యేకించి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా నిలవనుంది. ఆర్టీసీ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఇది కీలక అడుగుగా భావించవచ్చు.
ఈ సందర్భంగా డిపో అధికారులు మాట్లాడుతూ, ప్రయాణికుల స్పందనను బట్టి భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు పెంచే అవకాశం ఉందని తెలిపారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533