డీఎస్‌ఓ పెండింగ్ తొలగించాలంటే ముడుపులా? – ఏజెంట్ల దందా బయటపడుతోందా?”
“అర్హులకే కాదు… చందాలిస్తే రేషన్ కార్డు – మండల స్థాయిలో అవినీతి ఆరోపణలు”
“రేషన్ కార్డుల ఆప్షన్ ఆడిన ఆట – అధికారులు మౌనంగా ఎందుకు?”
నిజామాబాద్ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి రేషన్ కార్డులు కేటాయించాలన్న లక్ష్యంతో కలెక్టర్ ద్వారా మండల రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడినా, కార్యాచరణలో మాత్రం అవినీతి, మోసాలు ఊపందుకుంటున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
అర్హత లేని వ్యక్తులకు డబ్బులిచ్చి “డీఎస్‌ఓ పెండింగ్” స్టేటస్‌ను తొలగించి రేషన్ కార్డులు పొందేందుకు కొందరు మేనేజ్‌మెంట్ రూట్లో ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. మండల స్థాయిలో కాస్త ముడుపులు ఇస్తే, పరిశీలనలేమి గలవారికైనా కార్డులు అప్రూవ్ చేయించేస్తున్న దుస్థితి నెలకొంది. అర్హులైన వారు మాత్రం ఏడాది లాగనూ ఎదురుచూపులతో రేషన్ కార్డుల కోసం పోరాడుతున్నారు.
మరింత విచారకరం ఏమంటే, డీఎస్‌ఓ కార్యాలయంలో ‘పెండింగ్’గా నిలిపిన దరఖాస్తులపై కూడా కొందరు మీసేవ ఏజెంట్లు డబ్బులు తీసుకుని ‘పెండింగ్’ ఆప్షన్ తొలగించి అప్రూవల్ తెస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్న పరిస్థితి నెలకొంది. స్థానికుల వాదన మేరకు, ఈ అవకతవకలు జిల్లా స్థాయిలో అధికారుల దృష్టికి రాకుండా మేనేజ్‌మెంట్ పేరుతో జరిగిపోతున్నాయి.
ప్రజల డిమాండ్:
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి, మోసాలకు పాల్పడుతున్న వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నది స్థానిక ప్రజల ఆవేదన. “డీఎస్‌ఓ పెండింగ్ అనే ఆప్షన్ నైతికంగా, పారదర్శకంగా విచారించి మాత్రమే అప్రూవ్ చేయాలి” అంటూ వారు కోరుతున్నారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533