శ్రీనగర్ శివారులో కోల్డ్ స్టోరేజ్ వద్ద గంజాయి అమ్ముతున్న యువకుడు పట్టివేత….
టాస్క్ ఫోర్స్ దాడి: గంజాయి ప్యాకెట్లు, సెల్ ఫోన్ స్వాధీనం…
. గంజాయి ముఠాలపై టాస్క్ ఫోర్స్ సత్తా చూపింది..
. ప్యాంటు జేబులో గంజాయి… గదిలో మరింత నిల్వ…
నిజామాబాద్, జూన్ 26:
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు మాదకద్రవ్యాలపై కఠినంగా దాడులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై గోవింద్ మరియు సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో గంజాయి విక్రయదారుడిని అరెస్టు చేశారు.
ఈ దాడి నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ గ్రామ శివారులో గల కోల్డ్ స్టోరేజ్ వద్ద నిర్వహించబడింది. దారు కుమార్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారంతో అక్కడికి చేరుకున్న టాస్క్ ఫోర్స్ అతనిని పట్టుకొని తనిఖీ చేయగా, అతని ప్యాంటు జేబులో ఐదు గంజాయి ప్యాకెట్లు లభించాయి.
ఇది మాత్రమే కాకుండా, అనంతరం అతను నివసించే గదిలో తనిఖీ చేపట్టగా, ఒక బ్యాగులో 5.25 కిలోల ఎండు గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద నుండి ఒక సెల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు, స్వాధీనం చేసుకున్న గంజాయి మరియు సెల్ ఫోన్‌ను తదుపరి చర్యల నిమిత్తం నిజామాబాద్ రూరల్ SHO గారికి అప్పగించనైనది.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరించింది. మాదకద్రవ్యాలు విక్రయించేవారిపై ప్రజలు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసింది.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533