నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారి ఆదేశాలతో మత్తు ద్రవ్యాలు, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. గ్రామంలో మత్తు పానీయాలు, గంజాయి, డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, భవిష్యత్‌లో ఉత్తమ భారత పౌరులుగా తీర్చి దిద్దుకోవాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎడ్బిడ్ బస్టాండ్ ఆవరణలో ప్రారంభమైన అవగాహన ర్యాలీ, జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ వరకు శోభాయాత్రగా కొనసాగింది. అనంతరం పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ యువకులకు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దత్తాత్రే నిమ్మ పోతన్న, మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి, ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్, పి. జీవన్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఇక నిర్మల్ జిల్లా జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కే గురు ప్రసాద్ యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై, యువత మత్తుకు బానిసలకాకుండా, దేశాభివృద్ధికి పాలపడే విధంగా మేల్కొనాలని సూచించారు.
పోలీసు శాఖ డ్రగ్స్ విక్రేతలపై ఉక్కుపాదం మోపుతుందని, ఎవరైనా గంజాయి లేదా మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కూడా సూచించారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533