బోధన్‌లో కల్తీ నూనె దందా – అధికారుల మౌనసమ్మతి?
కల్తీ నూనె మాఫియాపై చర్యలు తీసేవారెవరూ లేరు!
ఆయిల్ మిల్లర్ల ముసుగులో మోసం – ఫేక్ ఆయిల్ మిల్లు కేసు లు తవ్వాలి!
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన కల్తీ నూనె మాఫియా – ఎవరి ఆశీర్వాదంతో?
. సామాన్యుల ఆరోగ్యంపై లాభాల గుదిబండ – బోధన్ కల్తీ నూనె స్కాం…
నిజామాబాద్ జిల్లా – బోధన్ ప్రత్యేక నివేదిక
బోధన్ పట్టణంలో కల్తీ వంట నూనె దందా యథేచ్ఛగా సాగుతోంది. అదిలాబాద్, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున ట్యాంకర్లలో వంట నూనె దిగుమతి చేస్తూ, వాటిని బ్రాండెడ్ స్టిక్కర్లు అట్టవేసి విక్రయిస్తున్నారు. ఈ కల్తీ వ్యాపారానికి సంబంధించి పలు మిల్లర్లు నిబంధనలు పాటించకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
కొన్ని రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టిఫిన్ హోటళ్ళు వంటి ప్రదేశాల్లో ఈ నూనె విస్తృతంగా వినియోగించబడుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టి, నిబంధనలు అతిక్రమిస్తూ కల్తీ వ్యాపారం సాగిస్తున్న మోసగాళ్లపై ఇప్పటికీ ఎలాంటి కఠిన చర్యలు కనిపించడం లేదు.
ప్రధాన ఆరోపణలు:
ఫుడ్ సేఫ్టీ అధికారుల మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది
కొన్ని ఆయిల్ మిల్లులు అసలు లైసెన్స్ లేకుండా పనిచేస్తుండటం
స్టిక్కర్ బ్రాండ్ల ముసుగులో ప్రజలను మభ్యపెట్టే వ్యాపారం..
అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణ.
కల్తీ ఆయిల్ మాఫియాపై పోలీస్ కమిషనర్ నేరుగా నిఘా పెట్టాలి….
సంబంధిత అధికారుల ప్రమేయం ఉంటే, వారిపై కూడా విచారణ జరగాలి…
ఫుడ్ సేఫ్టీ శాఖ స్వయంగా రంగంలోకి దిగి స్టిక్కర్ నూనె క్యాన్లను స్వాధీనం చేసుకోవాలి…
కల్తీ నూనె కొనుగోలుపై ప్రజలలో అవగాహన కల్పించాలి
విజ్ఞప్తి:
ప్రజలు నూనె కొనుగోలు చేసే సమయంలో లైసెన్స్ నెంబరు, తయారీ తేదీ, బ్రాండ్ పేరు వంటి వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలి. అనుమానాస్పద నూనె విక్రయాల గురించి ఫుడ్ సేఫ్టీ డిపార్టుమెంట్ కు ఫిర్యాదు చేయాలి.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....