నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల ఛేదన, ప్రజల భద్రత తదితర అంశాలపై బోధన్ డివిజన్ ఎ.సి.పి., సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు, ఎస్.ఐలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. గారు నడిపారు.
సమావేశంలో ముఖ్యంగా చర్చించిన అంశాలు:
ఆరు నెలల ప్లాన్ ఆఫ్ యాక్షన్:
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్న సూచనలు. బందోబస్తు, రహదారి భద్రత, సిబ్బంది సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు.
డ్రగ్స్, మట్కా, గ్యాంబ్లింగ్ నియంత్రణ:
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టి, లాడ్జీలపై సడెన్ తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు.
రోడ్ యాక్సిడెంట్ల నివారణ:
బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాలను అరికట్టే చర్యలు చేపట్టాలని సూచించారు.
పెండింగ్ కేసుల పరిష్కారం:
అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు కేసులను త్వరితగతిన పూర్తిచేయాలని, ముఖ్యంగా ఎన్బీడబ్ల్యూలను ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రత్యేక టీములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే LOCలు కూడా విడుదల చేయాలి.
సైబర్ మోసాల నివారణ:
1930 నంబర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, గేమింగ్ యాప్ల వల్ల మోసపోవకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
మహిళల భద్రత:
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
పెట్రోలింగ్ ముమ్మరం:
రాత్రి వేళల్లో పెట్రోలింగ్, వాహన తనిఖీలు నిర్వహించి దొంగతనాలను అరికట్టాలని సూచించారు.
డయల్ 100 స్పందన:
ప్రతి ఫిర్యాదుపై వేగవంతమైన స్పందన అవసరమని కమిషనర్ సూచించారు.
ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) శ్రీ బస్వారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం, తదితర అధికారులు పాల్గొన్నారు.
ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం అన్న విషయాన్ని అధికారులు స్పష్టంగా గుర్తు చేశారు.
సమర్థవంతమైన పాలనకు కట్టుబడి పనిచేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....