ఇంకా లేట్ అయితే న్యాయబద్ధం కాదు: హైకోర్టు ప్రభుత్వానికి గట్టి వార్నింగ్!
స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోగా నిర్వహించండి: హైకోర్టు ఆదేశాలు!
15 నెలలుగా ఖాళీగా ఉన్న సర్పంచ్ పదవులకు ఎన్నికల షెడ్యూల్ దిశగా..!
వార్డుల విభజనకి 30 రోజులు, ఎన్నికలకి తుది డెడ్‌లైన్ సెప్టెంబర్ 30..!
తెలంగాణలో సర్పంచ్ పదవుల ఖాళీలపై ఎట్టకేలకు న్యాయస్థానం గట్టి స్టెప్ వేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పిటిషన్లను విచారించిన హైకోర్టు — 2025, సెప్టెంబర్ 30లోగా రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందిగా కఠిన ఆదేశాలు జారీ చేసింది.
ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ మాధవిదేవి గారు — వార్డుల విభజన 30 రోజుల్లోగా పూర్తి చేయాలని, మొత్తం ఎన్నికల ప్రక్రియ మూడు నెలల్లో ముగించాల్సిందిగా స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదన, బీసీ రిజర్వేషన్ల సమస్య వల్లే ఆలస్యం జరిగిందన్న మౌఖిక నివేదికను పరిగణలోకి తీసుకున్నా, ప్రజాప్రతినిధుల లేకుండా గ్రామాలు ఉండటం సబబుకాదన్న తీర్పుతో హైకోర్టు ప్రామాణికంగా వ్యవహరించింది.
ఈ తీర్పుతో పంచాయతీ ఎన్నికల విషయంలో నెలలుగా సాగిన అస్పష్టత తొలగి, అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....