సాలూర మండల కేంద్రంలో ఈ రోజు జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలోని గ్రంధాలయ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సాలూర తహసీల్దార్ గారు స్వయంగా గ్రామాన్ని సందర్శించి, గ్రంధాలయ నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ అల్లే జనార్ధన్ గారు, గ్రామ పెద్దలు సంగేపు భూమయ్య, లోకపు లక్ష్మణ్, కె.జి. గంగారం, డిస్కో సాయిలు, మైదపు నాగరాజు, కన్నె సాయిరెడ్డి, రాహుల్ లక్ష్మణ్, ఈ. రమేష్, శివకాంత్, శివరాజ్, వీరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
గ్రంధాలయ కేంద్రం ఏర్పాటుతో గ్రామ యువత విద్యాాభివృద్ధిలో మరింత ముందుకు సాగనుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. గ్రామంలో విద్యాభివృద్ధికి ఇది ఒక శుభ సంకేతంగా భావిస్తున్నారు

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....