. ఇందిరమ్మ కల నెరవేర్చేందుకే కాంగ్రెస్ ఉద్యమం: మహేష్ కుమార్ గౌడ్….
“ప్రతి నిరుపేదకు ఇంటి హక్కు!” – బోధన్ సభలో మహేష్ గౌడ్ గర్జన..
. స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత త్వరలో – టీపీసీసీ అధ్యక్షుడి సందేశం….. బోధన్‌లో మహేష్ గౌడ్ పర్యటన ఘనంగా.. నేతలు, కార్యకర్తలతో ఉత్సాహం!…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు బోధన్ పర్యటన సందర్భంగా అభివృద్ధి, స్థానిక ఎన్నికలు, హక్కుల అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ నాయకులు ఘనంగా స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.మహేష్ గారు మాట్లాడుతూ, “స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మంత్రివర్గ సమావేశం అనంతరం స్పష్టత వస్తుంది. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం – ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే. ఇందిరమ్మ ఇండ్ల ద్వారా హక్కును కల్పించి, ప్రభుత్వ మద్దతును అందిస్తాం” అని స్పష్టం చేశారు.
ఈ సభలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గడుగు గంగన్నా, గంగా శంకర్, నాగేశ్వరరావు, పులి శ్రీను, చీల శంకర్ (AMC చైర్మన్), అల్లే రమేష్, శరత్ రెడ్డి, అల్లే జనార్ధన్, అశోక్, ధాము, పాషా భాయ్, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....