– పలు సేవా కార్యక్రమాలతో గొప్ప మనసు చాటుకుంటున్న యువ నాయకులు
– బిజెపి నాయకులు,NRI కోనేరు శశాంక్
కామారెడ్డి జిల్లా: నసరుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంప్ గ్రామంలో గల బీరప్ప మందిరానికి బోరు సామాగ్రి అవసరమవుతుందని సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు ను ఈ విషయాన్ని ఆయన బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లారు. కోనేరు శశాంక్ గుడిని సందర్శించి దర్శించుకున్నప్పుడు ఆలయ కమిటీ సభ్యులకు బోరు మోటర్ సామాగ్రి మొత్తం కొనుగోలు చేసి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎన్నారై కోనేరు శశాంక్ ఆదివారం రోజు జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు చేతుల మీదుగా బోరు మోటార్ కు సంబంధించిన పరికరాలన్నీ ఆలయ కమిటీ సభ్యులకు అందజేయించారు. ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ గుడిలో నీటి వసతి కొరకు బోరు మోటర్ ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, ఆలయ పరిసరాలను శుభ్రం చేసుకోవడానికి, భక్తుల సౌకర్యార్థం ఇంతగా నువ్వు ఉపయోగపడుతుందని అన్నారు. ఇలాంటి దైవ కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుస్తూ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. గొప్ప మనసుతో అడిగిన వెంటనే స్పందించి సహకారం అందించినందుకు గాను ఆలయ కమిటీ సభ్యులు కోనేరు శశాంక్, సున్నం సాయిలు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, రుద్రూర్ మండల ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, నస్రుల్లాబాద్ మండల నాయకులు మేకల రామన్న యాదవ్, అనుసూరి శ్రీనివాస్ ర్యాపని మహేష్, పెర్క రాములు, మనూర్ సాయిలు, కంది పెద్ద మల్లేష్, గంగాధర్ గుప్త, ఉల్లెంగ గోపి, కొప్పుల సాయిలు ,శేఖర్, ఉల్లెంగ పర్వయ్య,రవి డాక్టర్,బండపల్లి శ్రీను, జల్ల సాయి, కిష్టయ్య, బేగరి సాయిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..