Post Views: 34
బోనాల శోభాయాత్రలో జాతి ఐక్యత.. మున్నూరు కాపు, ముదిరాజ్ సంఘాల వినూత్న నిర్వాహకం..
. ఊరేగింపులతో ఒలకబోసిన భక్తి.. బోధన్‌లో బోనాల పండుగ సందడి..
సాంప్రదాయాలకు నిదర్శనంగా బోధన్‌లో బోనాల వేడుకలు..
మహాలక్ష్మి అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పణ…
బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మున్నూరు కాపు మరియు ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రోజు బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మహిళలు శోభాయమాన వస్త్రధారణలతో ఊరేగింపుగా బోనాలను తీసుకురాగా, డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలు వేడుకలకు హైలైట్‌గా నిలిచాయి. మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, ప్రజల సంక్షేమం కోసం పూజలు నిర్వహించారు. సంఘాల నాయకులు ఈ ఉత్సవాన్ని తరం నుండి తరానికి సంక్రమించే సంప్రదాయం అని తెలియజేశారు. వివిధ కుల సంఘాల పెద్దలు, మహిళలు, యువత ఈ వేడుకలో పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....