V1News Telangana

best news portal development company in india

📰 విరాళంతో హోమియో సేవల బలోపేతం

SHARE:

బోధన్ హోమియో ఆసుపత్రికి మందుల విరాళం…
సామాజిక సేవలో మెజిస్ట్రేట్, ఉపాధ్యాయులు ముందస్తున్న బోధన్‌లో మందుల విరాళం…
. సీజనల్ వ్యాధులపై పోరాటానికి సామాజిక సేవగాళ్ల సాయం…
. అత్యవసర మందులకు విరాళాల రూపంలో ఊపిరి..
వైద్య సేవల బలోపేతానికి ప్రజల చేతుల ముందుకు..

బోధన్ టౌన్ :
ప్రభుత్వ హోమియోపథీ ఆసుపత్రిలో మందుల కొరతను దృష్టిలో పెట్టుకొని, సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో పలువురు ప్రముఖులు మందుల విరాళం అందించారు.
బోధన్ పట్టణానికి చెందిన స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ శ్రీ శేషతల్పసాయి, విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీ వై.వి. శ్రీనివాస్ రావు గారు, గుంటూరుకి చెందిన మాధవ్ రావు గారు, మరియు లక్ష్మణ్ నాయక్ గారు — హోమియోపథీ ఆసుపత్రికి అత్యవసర మందుల విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఫార్మసిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీమతి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ — ‘‘సీజనల్ వ్యాధులు మరియు అత్యవసర పరిస్థితులలో పేషెంట్లకు అవసరమయ్యే మందులు ప్రభుత్వ సరఫరాలో అందుబాటులో లేవు. ఈ విరాళాలు మాకు ఎంతో ఉపయోగపడతాయి’’ అని పేర్కొన్నారు.
వీరంతా సమాజంలోని బాధితుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, మందులు అవసరమవుతున్నప్పుడు లభ్యత కోసం ఎదురు చూడకుండా వెంటనే అందుబాటులో ఉండాలనే శ్రేయోభిలాషతో ఈ సేవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిసింది.

 

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india
best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई