V1News Telangana

best news portal development company in india

బిజెపి నాయకుల ఆధ్వర్యంలో “రచ్చబండ” చెట్లు నాటే కార్యక్రమం నిర్వహణ…..

SHARE:

– నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలన ముగిసిన సందర్భంగా

– పేదల అభ్యున్నతి కొరకు నిరంతరం శ్రమించే గొప్ప నాయకుడని ప్రశంసలు

– సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ, ప్రజలకు క్లుప్తంగా వివరణ

– బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ

రుద్రూర్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం రోజు బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలన పూర్తి అయిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని “రచ్చబండ”కార్యక్రమం మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ 11 సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధిని, పేదల అభ్యున్నతి కొరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రైతులు పండించే 12 రకాల పంటలకు మద్దతు ధరలు పెంచడం, “కిసాన్ సమ్మాన్ నిధి”, “ఫసల్ భీమా యోజన”, “పీఎం గ్రామ సడక్ యోజన” “ఆర్టికల్ 370”, “ఆపరేషన్ సిందూర్”, “ఆయుష్మాన్ భారత్”, “నారీ శక్తివంతం”, “మాతృ వందన యోజన”, “విశ్వకర్మ యోజన”వంటి ఎన్నో గొప్ప పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతున్న గొప్ప నాయకుడని కొనియాడారు. నరేంద్ర మోదీ దేశ ప్రజల సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన అనేక పథకాల గురించి ప్రజలకు క్లుప్తంగా వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాలలో గెలుపొందే విధంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల ఓబీసీ అధ్యక్షులు, యువ మోర్చా మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, మండల సీనియర్ నాయకులు పార్వతీ మురళి, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, మండల కోశాధికారి రామ్ రాజు, ఉపాధ్యక్షులు వినోద్ కుమార్,SC మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్, శ్రీనివాస్, అనిల్, సాయికుమార్,
కె .గణేష్, నాగయ్య, మండల పదాధికారులు, శక్తి కేంద్రం ఇన్చార్జీలు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india
best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई