V1News Telangana

best news portal development company in india

సర్కారు బడుల్లో సమస్యలు పరిష్కారమయ్యేనా….?

SHARE:

– నేటినుండి తెరుచుకోనున్న పాఠశాలలు

– అరకొర వసతులతో అవస్థలు పడుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

– మౌలిక వసతులు కల్పించడం లో విఫలమవుతున్న సంబంధిత శాఖ

– తూతూ మంత్రంగా “బడిబాట” కార్యక్రమం విద్యార్థులపై కానరాని ప్రభావం, నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

– ప్రైవేటు బడులలో నియంత్రంలేని ఫీజుల దోపిడీ

– పుట్ట భాస్కర్ తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ & బీసీ సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ మరియు బీసీ సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి పుట్ట భాస్కర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ బుధవారం రోజు ప్రెస్ నోట్ విడుదల ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులు ముగించుకుని నేటి నుండి బడులు పునః ప్రారంభం కానున్నాయని 2025, 2026 విద్య సంవత్సరం మొదలు కాబోతుందని అన్నారు. ప్రభుత్వ బడులలో విద్యార్థులకు అవసరమయ్యే కనీస మౌలిక వసతులను కల్పించడానికి సంబంధిత శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలని తెలిపారు .. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాల పాఠ్యపుస్తకాలు మండల విద్యాశాఖ అధికారుల యొక్క కార్యాలయాలకు చెరవేసిందని.. యూనిఫామ్ బాధ్యతలను సంబంధిత ఐకేపీ అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందేనని .. అక్కడి నుండి పుస్తకాలు సంబంధిత పాఠశాలలకు చేరుకున్నాయని తెలిపారు.అయితే కొన్ని చోట్ల పాఠ్యపుస్తకాలు తక్కువ రావడం జరిగిందని అధికారులు వాపోతున్నారన్నారు.. ఇందులో కొన్ని తరగతులకు చెందిన సబ్జెక్టు పాఠ్యపుస్తకాలు పూర్తిగా రాలేదని ,అలాగే విద్యార్థులకు ప్రతిరోజు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో తీసుకోవాల్సిన నాణ్యతా ప్రమాణాలు.. భోజనానికి కావలసిన వంట సామాగ్రిని ప్రభుత్వ అధికారులు పరిశీలన చేసి విద్యార్థులకు ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగకుండా చూసుకోవాలని కోరారు.ఎందుకంటె గత సంవత్సరం చాలా చోట్ల పాఠశాలలు ప్రారంభం అవగానే చాలామంది విద్యార్థులు విష ఆహారం బారిన పడి తీవ్ర అస్వస్థతకి గురయ్యారని విషయం గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు, దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నాణ్యమైన, క్రమశిక్షణతో కూడిన విద్యతో అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదివేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు.అన్ని చోట్ల మౌలిక వసతులు కల్పించి మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేసే వరకు తెలుగు నాడు విద్యార్థి సంఘం మరియు బీసీ సంఘం తరఫున నిర్విరామంగా పోరాడుతామని ప్రభుత్వానికి, కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india