నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒక మధురమైన సంఘటనకు వేదికైంది. 2003-04లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు, 21 ఏళ్ల అనంతరం, మళ్లీ ఒకచోట చేరి ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ మధుర క్షణాలకు సాక్షులుగా, విద్యార్థుల జీవితాలను మలిచిన ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి సార్, మనోహర్ సార్, అలాగే మండల ఎంఈఓ రాజీ మంజూష గారు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. వారి ఆశీస్సులు, స్ఫూర్తిదాయకమైన మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాయి.

పాఠశాల ప్రాంగణం మరోసారి స్మృతుల వేదికగా మారగా, ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే కాలం నిలిచిపోయిందన్న భావన కలిగించింది.
ఈ పునర్మిళనం విద్యార్థుల మధ్య బంధాలను మరింత బలపరచడమే కాక, పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పాన్ని ఉల్లేఖించింది.
“గురువు ఆశీస్సు – విద్యార్థుల విజయానికి ఆద్యంతం” అనే సందేశంతో, ఈ సమావేశం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
మరోసారి ఇంత గొప్ప అనుభూతిని పంచుకున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








