అర్జీ.1 ఏరియాలో మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించాలీ ఆర్జీ. 1 జిఎం డి. లలిత్ కుమార్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం మే 16:-
గోదావరిఖని మరియు పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశములు కల్పించుటకు సింగరేణి సి&ఏం.డి శ్రీ ఎన్. బలరాం IRS సూచనల మేరకు తేది.18.05.2025, ఆదివారం రోజున మెగా జాబ్ మేళా కార్యక్రమం జవహార్ లాల్ నెహ్రు స్టేడియం నందు పెద్ద ఎత్తున నిర్వహించుటకు సంబందించి ఏర్పాట్లు గురించి ఆర్జీ. 1 జిఎం డి. లలిత్ కుమార్ అధ్యక్షతన సమావేశ హాలులో ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా జియం తెలియజేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా తలపెట్టిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి తేది.18.05.2025, ఆదివారం రోజున జవహార్ లాల్ నెహ్రు స్టేడియం నందు నిర్వహించుటకు సంబందించిన పనుల గురించి, చేపట్టవలసిన ప్రణాళికల గురించి అధికారులతో సమీక్షా నిర్వహిచడం జరిగింది. ఇట్టి జాబ్ మేళా కు సంబందించి హైదరాబాదుకు చెందిన 80 నుండి 100 ప్రైవేటు కంపెనీలు పాల్గొనటం జరుగుతుందని తెలిపారు. ఈ కంపెనీలలో వివిధ రకాల ఉద్యోగ అవకాశాలకు సంబందించి కంపెనీల యొక్క ప్రతినిధులు పాల్గొనటం జరుగుతుందని తెలిపారు. ఇట్టి మెగా జాబ్ మేళా నిర్వహణకు సంబందించిన అన్ని రకాల వసతులు, ఏర్పాట్లను పకడ్బందింగా నిర్వహించాలని ఎక్కడ కూడా ఇబ్బందులు కలుగకుండా సజావుగా జరుగు విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేసారు. ఈ కార్యక్రమంలో జిఎం క్వాలిటి భైధ్య, యస్.ఓ.టు జిఎం గోపాల్ సింగ్, డిజియం పర్సనల్ కిరణ్ బాబు, అధికారులు దాసరి వెంకటేశ్వర్ రావు, చిలక శ్రీనివాస్, ఆంజనేయులు, కర్ణ, ఆంజనేయ ప్రసాద్, జితేందర్ సింగ్, వరప్రసాద్, రవీందర్ రెడ్డి, డెనిల్ కుమార్, వీరారెడ్డి, శ్రావణ్ కుమార్, హనుమంత రావు, అశోక్ రావు, శ్రీహర్ష ఇతర అధికారులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM