V1News Telangana

best news portal development company in india

*రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదు* *అంబేద్కర్ ఆశయాల తో ముందుకు సాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ* *జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్*

SHARE:

రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికి లేదని, అది దేశ ప్రజల పవిత్ర గ్రంథమని..*ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* అన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, బైంసాలో బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడుతున్నారని, ఆయన చేసిన సేవ ప్రపంచానికి చాటాలని కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి, పంచ తీర్థాల పేరుతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఏ పార్టీలైనా, ఈ ప్రభుత్వాలైన అంబేద్కర్ గౌరవిస్తున్నాయని, తెలంగాణలో గత ప్రభుత్వం సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయడం, ట్యాంక్ బండ్ వద్ద 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి, మహనీయుని సేవలను గుర్తించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచారన్నారు. న్యాయ మంత్రిత్వ శాఖలో, సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ మహనీయుని వల్లే నేడు దేశం గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశంగా వెలుగోందుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఆయన సూచించిన మార్గంలో నడుచుకోవాలన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india