V1News Telangana

best news portal development company in india

VDC అక్రమాలపై ఉక్కుపాదం: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ హెచ్చరిక… గ్రామాభివృద్ధి కమిటీల చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు… . బహిష్కరణలు చేస్తే సహించం – పోలీస్ కమీషనర్ వార్నింగ్… VDCల పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు… చట్టానికి విరుద్ధంగా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తప్పవు..

SHARE:

నిజామాబాద్, ఏప్రిల్ 9:

గ్రామాభివృద్ధి కమిటీల (VDC) పేరుతో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ స్పష్టం చేశారు. గత 15 సంవత్సరాల క్రితం గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటైన ఈ కమిటీలు ప్రస్తుతం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, పలు గ్రామాల్లో భూ తగాదాలు, కుటుంబ వివాదాలు వంటి సివిల్ విషయాల్లో అక్రమంగా పంచాయితీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

వీటి పేరుతో గ్రామ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, బహిష్కరణ విధించడం, షాపులపై వేలం నిర్వహించడం వంటి చర్యలు చట్టానికి పూర్తిగా వ్యతిరేకమని కమీషనర్ తెలిపారు. గ్రామాల్లో ఎవరికైనా సమస్యలు ఉంటే వారు సంబంధిత ప్రభుత్వ శాఖలను సంప్రదించి సహకారం పొందాలని సూచించారు.

ఇకపై ఇలాంటి అక్రమ కార్యకలాపాలు చేసిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని, ఎవ్వరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. VDCల వల్ల ఇబ్బందులకు గురైన ప్రజలు తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india