V1News Telangana

best news portal development company in india

నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఘనంగా బిజెపి పార్టీ 45 వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు…..

SHARE:

– అటల్ బిహారీ వాజ్ పేయి , లాల్ కృష్ణ అద్వానీలు పార్టీ వ్యవస్థాపకులు

– 1980 ఏప్రిల్ 6 వ తేదీన పార్టీ ఆవిర్భావం

– భారత దేశంలోని ప్రముఖ జాతీయ స్థాయి రాజకీయ పార్టీలలో ఒకటి గా ప్రత్యేక గుర్తింపు

– పార్టీ స్థాపించిన నాటి నుండే బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి

– హిందూ భావజాలం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, మతవిద్వేషాలపై తిరుగుబాటు, దృఢమైన దేశభక్తి పార్టీ సిద్ధాంతాలు

– నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు

నసురుల్లాబాద్ ప్రతినిధి

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజు బిజెపి పార్టీ 45 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలను పంచిపెట్టుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నస్రుల్లాబాద్ మండల బిజెపి అధ్యక్షులు సున్నం సాయిలు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. 1980 ఏప్రిల్ 6 వ తేదీన అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ లు భారతీయ జనతా పార్టీని స్థాపించారని .. అటల్ బిహారీ వాజ్ పేయి భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డారని తెలిపారు. బిజెపి పార్టీ భారతదేశంలోని ప్రముఖ జాతీయ స్థాయి రాజకీయ పార్టీలలో ఒకటి గా వెలుగొందుతుందని.. పార్టీ స్థాపించిన నాటి నుండే భారతీయ జనతా పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగుతూ వస్తుందని అన్నారు. భారతదేశ రాజకీయ రంగంలో నాలుగు దశాబ్దాల పాటు ఆధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడేందుకు భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుందని తెలిపారు. భారతదేశంలోని హిందూ భావజాలం , మత విద్వేషాలపై తిరుగుబాటు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, దృఢమైన దేశభక్తి పార్టీ యొక్క భావజాలాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలో గట్టి పునాదులుగా నిలుస్తున్నాయని అభివర్ణించారు. పార్టీ స్థాపించిన నాటి నుండి తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ప్రాబల్యం ఉండేది కాదని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన దక్షత, ఆయన అనుసరించే విధానాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో బిజెపి పార్టీ క్షేత్రస్థాయిలో మెరుగైన అభివృద్ధి సాధించిందని అన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారం చేపట్టే విధంగా రెట్టింపు ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నాయకులు నసురుల్లాబాద్ మండల ఇంచార్జ్ దొరబాబు, మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు యాదవ్, మండల ఉపాధ్యక్షులు అనుసూరి శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గొడిసెల యాదగిరి గౌడ్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్, యువ మోర్చా అధ్యక్షులు మహేష్, శక్తి కేంద్రం ఇంచార్జ్ గంగాధర్ గుప్తా, బూత్ అధ్యక్షులు కంది పెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి, టి. పవన్,

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india