– ద్రోణవల్లి సతీష్
బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ తన సొంత నివాసంలో ఆదివారం రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాసుల బాలరాజ్ ఇతర వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలపై చేసే అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు మానుకోవాలని లేనియెడల రాజకీయ భవిష్యత్తు మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. శనివారం రోజు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించి మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడి మరణం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అతను మరణిస్తే దానిని వక్రీకరించి అనారోగ్యంతో మరణించాడని మాట్లాడడం సబబు కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా నాపై కూడా పలుమార్లు మీడియా సమక్షంలో అసత్య ప్రచారాలు చేయడం వలన మీ వ్యక్తిత్వం సరిగ్గా లేదని అన్నిసార్లు ఓడిపోవడం జరిగిందని ఎద్దేవా చేశారు. ప్రతిసారి నా పైన అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు చేస్తూ తమ స్థాయిని తగ్గించుకుంటున్నారని విమర్శించారు. ఒకవేళ తాను అవినీతికి పాల్పడినట్లు నియోజకవర్గ శాసనసభ్యుల సమక్షంలో రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని సవాలు విసిరారు. ఏ దైవ సన్నిధిలోనైనా ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని.. ఎక్కడికి రమ్మన్నా వచ్చి నిజాయితీ నిరూపించుకుంటానని తెలియజేశారు. ఎదుటివారిపై అక్కస్సుతో ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మీ రాజకీయ మనుగడకే కలంకమని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..