V1News Telangana

best news portal development company in india

నారాయణ్ రావు పటేల్ గారి ఆధ్వర్యంలో ₹4.39 కోట్లు నిధుల మంజూరు – గ్రామాల అభివృద్ధికి బిగ్ బూస్ట్

SHARE:

భైంసా టౌన్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముధోల్ తాలూకాకు చెందిన 7 మండలాల అభివృద్ధి కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ₹4.39 కోట్లు నిధులను మంజూరు చేసింది.

ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ చేండ్రే మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి భోస్లే నారాయణ్ రావు పటేల్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భైంసా మండల అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, ముధోల్ మండల అధ్యక్షుడు గంగారెడ్డి, బాసర మండల సీనియర్ నాయకుడు జంగం రమేష్, అష్ట శ్రీనివాస్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ నిధులతో మండలాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, గ్రామీణ ప్రాంతాల ప్రగతికి తోడ్పాటు లభించనుంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india