బోధన్: బోధన్ బాన్సువాడ డివిజన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు వినతి పత్రం ఇవ్వబడింది. ఈ విషయంపై అశోక్ అధికారులను కలుసుకొని మంజీరా వాగు నుంచి భారీగా ఇసుక రవాణా జరుగుతోందని వివరించారు.
నంబర్ ప్లేట్ లేని వాహనాలు, అధిక లోడుతో నడుస్తున్న ట్రాక్టర్లు, అనర్హులైన డ్రైవర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడమే కాకుండా, వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పారు.
ఇసుక మాఫియా దారులు మంజీరా వాగు నుంచి తీసుకొచ్చిన ఇసుకను రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచి, అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కోడిచెర్ల, సిర్పూర్, మద్నూర్, బిచ్కుంద ప్రాంతాల నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు పెద్ద ఎత్తున ఇసుక తరలింపు జరుగుతోందని వివరించారు.
ఇటీవల ఓ అధికారి ఇసుక అనుమతుల కోసం రూ.2 లక్షలు తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయని, దీనిపై దర్యాప్తు జరిపించాలని కోరారు.
సబ్ కలెక్టర్ వికాస్ మహతో దీనిపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకుని, ఇసుక దందాకు ముగింపు పలకాలనే డిమాండ్ బలపడుతోంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








