బోధన్ మున్సిపాలిటీ కఠిన చర్యలు – మున్సిపల్ పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసులు!
. పన్ను బకాయిలు చెల్లించని వారికి కఠిన చర్యలు – నీటి కనెక్షన్లు నిలిపివేత!
బోధన్ పట్టణ వాసులకు మున్సిపల్ అధికారుల విజ్ఞప్తి – పన్నులు సమయానికి చెల్లించండి!
. శాస్తులు, కట్టుబాట్లు తప్పించుకోండి – మున్సిపల్ పన్నులు వెంటనే చెల్లించండి..
బోధన్ పట్టణంలో మున్సిపల్ పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయడానికి మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగారు. స్పెషల్ ఆఫీసర్ AC (LB) మరియు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్లు నిర్వహిస్తున్నారు.
ఈ చర్యలలో భాగంగా, మున్సిపల్ పన్నులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అలాగే, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి శాస్తులు విధించడం, నీటి కనెక్షన్లను తెంచివేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు.
అందువల్ల, బోధన్ పట్టణంలోని అన్ని వాణిజ్య దుకాణదారులు, నివాసదారులు మున్సిపల్ అధికారులకు సహకరించి తమ తమ పన్నులను సమయానికి చెల్లించాలి. ఏవైనా జాప్యం జరిగితే అదనపు శాస్తులు లేదా కనెక్షన్ తొలగింపు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పట్టణ అభివృద్ధికి సహకరించి, మున్సిపల్ పన్నులు సమయానికి చెల్లించమని మున్సిపల్ అధికారులు పునరుద్ఘాటించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








