పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా పీపీఈ కిట్స్ ధరించాలి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణ శ్రీ
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం, మార్చి 15 :
రామగుండం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా పీపీఈ కిట్స్ ధరించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణ శ్రీ అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణ శ్రీ ఎన్ టి పి సి లోని ఈడిసి ఆడిటోరియంలో రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వస్తువులు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణ శ్రీ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా సర్వేక్షన్ క్యాటగిరి వారిగా మార్క్ లను వివరించారు. పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా పీపీఈ కిట్స్ ధరించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.పీ.పీ.ఈ. కిట్స్ ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలు, అనర్థాలను అదనపు కలెక్టర్ వివరించారు.అనంతరం అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ పారిశుధ్య కార్మికులకు అవసరమైన వస్తువులు, చీరలు, టవల్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM