V1News Telangana

best news portal development company in india

వసతి గృహాల్లో పరిశుభ్రతను కాపాడాలి – డిఎంహెచ్వో గురుకులాల్లో పరిశుభ్రత లేకపోతే ఆరోగ్య సమస్యలు – డాక్టర్ బి. రాజశ్రీ… . మినీ హెల్త్ క్యాంప్ – విద్యార్థులకు చికిత్స అందించిన వైద్య సిబ్బంది…  హాస్టల్ పరిశుభ్రతపై అధికారుల కఠిన చర్యలు..

SHARE:

 

నాగారంలోని మైనార్టీ గురుకులాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అపరిశుభ్రత వల్ల విద్యార్థులకు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.

పరిసరాలు, టాయిలెట్స్, వంట గదులు శుభ్రంగా ఉండేలా వార్డెన్ ప్రత్యేకంగా చూసుకోవాలని సూచించారు.వంట మనుషులు వంటసామాను మరియు కూరగాయలను శుభ్రపరచి వంట చేయాలని, మిగిలిన ఆహారాన్ని సమయానికి పారవేయాలని సూచించారు. అదనపు గదులు కేటాయించి,

విద్యార్థుల సంఖ్య గదికి తగినంతగా ఉండేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో పిఓఎన్సిడి డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సబియుద్దీన్, హెచ్ఈఓ గిరి బాబు, నాగరాజు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Boddula Ganesh Kumar
Author: Boddula Ganesh Kumar

Mobile no:-9515959863

best news portal development company in india