V1News Telangana

best news portal development company in india

ఘనంగా కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు….

SHARE:

– నసురుల్లాబాద్ గ్రామంలో విద్యార్థులకు పళ్ళు, పెన్నులు పంపిణి

– పదవ తరగతి విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటన

– మైలారం గ్రామంలో విద్యార్థులకు పళ్ళు, ప్లేట్లు పంపిణీ

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మరియు మైలారం గ్రామంలో గురువారం రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ క్రమంలో వారు కేక్ కటింగ్ చేసి, పరస్పరం మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. బాణాసంచా పేల్చి సందడిగా నిర్వహించారు. అనంతరం నసురుల్లాబాద్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పండ్లు మరియు పెన్నులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ.5000, ద్వితీయ బహుమతిరూ.3000, తృతీయ బహుమతి రూ.2000 కల్వకుంట్ల కవిత జన్మదిన శుభ సందర్భంగా నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. మైలారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు విద్యార్థులకు పళ్ళు, స్టీల్ ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు కృషి, పట్టుదలతో సమయాన్ని వృధా చేయకుండా రాబోయే పరీక్షలకు సన్నద్ధం అవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ , మోచి గణేష్, నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, వెంకట్ సార్, మంగళి సాయి, మోసిన్, అల్లం రాములు, హైమద్, మహేందర్, ఆనంద్ గౌడ్, రమేష్, షఫీ, అల్లం గంగారం, నాగభూషణ్, డి. సాయిలు, కుమార్, దొంతి భాస్కర్, సుంచు శేఖర్, నరసింహులు, సాయిలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india