V1News Telangana

best news portal development company in india

స్వచ్ఛందంగా సామూహిక శ్రీమంతాలు….

SHARE:

– నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహణ

– పాల్గొన్న గర్భిణీలు, బాలింతలు

– పౌష్టికాహారం, పోషణ, ఆరోగ్యం పై అవగాహన

– గర్భిణీ స్త్రీలకు భర్తలు, అత్తమామలు సహకారం అందించాలని విజ్ఞప్తి

– ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా మంగళవారం రోజు నెహ్రూ యువజన కేంద్రం స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో , ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి పర్యవేక్షణలో గ్రామంలో గల గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు జరిపించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి మాట్లాడుతూ బాలింతలకు మరియు గర్భవతులకు పౌష్టికాహారం, పోషణ, ఆరోగ్యం గురించి పాటించవలసిన తగిన జాగ్రత్తలను వివరించారు. గర్భిణీలుగా ఉన్నప్పుడు అధిక బరువులు ఎత్తకూడదని అదేవిధంగా స్వల్ప పాటి వ్యాయామాలు చేయడం వలన శరీరం చురుకుగా ఉండి పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారని తెలిపారు. అధిక పోషకాలు లభించే ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, పాలు, కోడిగుడ్లు వంటి వాటిని ఎక్కువగా స్వీకరించాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలకు వారి భర్తలు , అత్తమామలు కూడా సహకరించాలని .. తద్వారా వారికి సుఖప్రసవాలు జరుగుతాయని.. పుట్టే బిడ్డలు మంచి బరువుతో, ఆరోగ్యంగా పుడతారని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువజన సంఘం అధ్యక్షులు సునీల్, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india