బోధన్, (తేదీ): రాబోయే వేసవి కాలంలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు, సాలూర మండల హెడ్ క్వార్టర్ పరిధిలో పెరిక సంగం వద్ద, బోధన్ టౌన్-2 సెక్షన్ పరిధిలో అదనంగా 100 కే.వి.ఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి, కే. నాగేష్ కుమార్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, బోధన్ గారి చేత చార్జ్ చేయబడింది.
విద్యుత్ సరఫరా లోపాలు లేకుండా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు 3 వైర్ లైన్లను 5 వైర్ త్రీ-ఫేజ్ లైన్లుగా మార్చడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళ్యాణ్, ఏ.ఈ, బోధన్ టౌన్-2, నాయిని కృష్ణ, ఏ.ఈ, బోధన్ టౌన్-1, విద్యుత్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, వినియోగదారులు పాల్గొన్నారు.
ఈ ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా అన్ని కేటగిరీల వినియోగదారులకు లో-వోల్టేజ్ సమస్యలు లేకుండా, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోబడినవి. స్థానిక వినియోగదారులు ఈ అభివృద్ధికి హర్షం వ్యక్తం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








