👉 ఆరోగ్యమే మహాభాగ్యం
👉1 కోటి 43 లక్షల వ్యయంతో నూతన ఆసుపత్రి నిర్మాణం
👉 స్థలం దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు
👉 ముప్పానేని సుబ్బారావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా పిలవబడుతుందని సూచన
👉 పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు
👉 రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
V1 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండల కేంద్రంలో రూ. 1 కోటి 43 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే 30 పడకల PHC ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా,DM &HO రాజశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు.

కోటీశ్వరుల కైనా పేదవారికైనా తమ ఆరోగ్యం ముఖ్యం అని తెలిపారు. సమాజంలో 90 శాతం మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు పొందుతున్నారని అన్నారు. చందూర్ గ్రామం పై ఉన్న ప్రేమాభిమానాలతో సుమారు కోటి రూపాయలు విలువచేసే స్థలాన్ని వారి తండ్రి కీ.శే ముప్పానేని సుబ్బారావు జ్ఞాపకార్థం .. శ్రీమతి పరుచూరి చంద్రావతి-విద్యాసాగర్ ఆసుపత్రి నిర్మాణానికి స్థలాన్ని దానం చేశారన్నారు. స్థలం దానం చేసిన దాతలకు ప్రభుత్వం తరఫున, చందూర్ మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కీ.శే ముప్పానేని సుబ్బారావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఆయన జ్ఞాపకార్థం పిలువబడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. నేడు బాన్సు వాడ ఆసుపత్రి వైద్య సేవలలో ముందుందని కొనియాడారు. ప్రజలు వ్యాధులు సోకిన తర్వాత చికిత్స తీసుకొనే బదులు ముందుగానే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సగటు మనిషికి ఆరోగ్యకరమైన జీవనం కొరకు స్వచ్చమైన గాలి,పరిశుభ్రమైన మంచి నీరు, రసాయనిక ఎరువులు వినియోగించని సేంద్రీయ ఆహార పదార్థాలు అవసరమని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులను మంజూరు చేస్తుందని అన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నూతన ప్రభుత్వాసుపత్రులలో ICU మరియు బెడ్స్ ను కూడా ఏర్పాటు చేశారన్నారు. ఎంత పెద్ద జబ్బుకైనా ప్రభుత్వాసుపత్రుల్లోనే వైద్య సేవలు అందే విధంగా అన్ని రకాల అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ప్రైవేటు ఆసుపత్రుల కంటే మెరుగైన వైద్య సేవలు పొందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, చందూర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు .
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








