V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో గల బిజెపి పార్టీ కార్యాలయంలో బుధవారం రోజు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్ జయంతి కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్ పేయి భారతదేశానికి అందించిన సేవలు మరువలేని అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీలం చిన్న రాజులు, బిజెపి పార్టీ బాన్సువాడ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, చిదర సాయిలు, పైడిమల్ లక్ష్మీనారాయణ, శంకర్ గౌడ్, కులాల గంగారెడ్డి, సుధాకర్ గౌడ్, విట్టల్, శ్రీకాంత్, అశ్విన్, అంజయ్య, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








