V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో గల పదవ వార్డు అయిన సాయి కృపా నగర్ కాలనీలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిధులు రూ. 3 కోట్ల ఐదు లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుత్తే దారులు రోడ్డు మరియు డ్రైనేజీ పనులను నాణ్యతతో మరియు త్వరితగతిన నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎర్వల కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఎజాస్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








