– నసురుల్లాబాద్ మండల అంబేద్కర్ కమిటీ ప్రధాన కార్యదర్శి నీరడి లక్ష్మణ్
కామారెడ్డి జిల్లా:రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంటు సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుండి తొలగించాలని నసురుల్లాబాద్ మండల అంబేద్కర్ కమిటీ ప్రధాన కార్యదర్శి నీరడి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ భారత దేశంలో అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగంతో దిక్సూచిని ఏర్పాటు చేసి.. బడుగు బలహీన వర్గాల పేద ప్రజల్లో వెలుగులు నింపిన మహనీయుడని కొనియాడారు. అలాంటి గొప్ప మహానుభావుడి పై కేంద్ర మంత్రి పదవిలో ఉన్న అమిత్ షా దళిత వర్గాల ఆశాజ్యోతి, ఆరాధ్య దైవమైన అంబేద్కర్ ను ఉద్దేశించి కించపరిచే విధంగా మాట్లాడి.. దళితుల మనోభావాలను దెబ్బతీసినందుకు కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించడమే కాకుండా బిజెపి పార్టీ నుండి కూడా ఆయనను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








